Patalaniki Prayanam (Telugu) - Chirukaanuka

Patalaniki Prayanam (Telugu)

Sale price ₹ 99.00 Regular price ₹ 110.00

ఒక రంగంలో లభ్యమై వున్న విజ్ఞానాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని, దాని ఆధారంగా అద్భుతమైన సాహస గాథలు అల్లడంలో ప్రథముడు అని చెప్పుకోదగ్గ జూల్స్‌ వెర్న్‌, 1828లో ఫ్రాన్స్‌లో పుట్టాడు.

''ఆధునిక విజ్ఞానం ఇంత వరకు ప్రోదిచేసుకున్న భౌగోళిక, భూగర్భ, భౌతిక, ఖగోళ విజ్ఞానాన్ని అంతటినీ వినోదభరితంగా, ఆసక్తిదాయకంగా నవలా రూపంలో పొందుపరుస్తూ, ఆ విధంగా మొత్తం విశ్వ చరిత్రని పాఠకుడి ముందు ఉంచాలి'' అన్న లక్ష్యంతో రాయతలపెట్టిన ''అసామాన్య ప్రయాణాలు'' అనే కావ్యమాలిక ముందుగా "Journey to the center of the Earth"1863లో వెలువడింది. అన్వేషణా యాత్రలని, సాహస యాత్రలని ఒక విధంగా గొప్ప వైజ్ఞానిక ప్రయత్నాలుగా పరిగణించే కాలం అది. అయితే ఆ అన్వేషణా యాత్ర భూగర్భం లోతుల్లోకి చొచ్చుకుపోతూ, భూమి లోతులని శోధిస్తే ఎలా వుంటుంది అన్న అద్భుతమైన ప్రశ్నకి సమాధానంగా పుట్టిన కావ్యమే Journey to the Center of the Earth.

  • Author: Dr Srinivasa Chakravarthi
  • Publisher: Manchi Pustakam Publications (Latest Edition)
  • Paperback: 234 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out