Nikhileswar Kavithvam (Telugu) - 2017
Sale price
₹ 489.00
Regular price
₹ 500.00
“రాజకీయ దృక్పథం, సమస్యలపై స్పందన లేకుండా ఉత్తమ సాహిత్య సృష్టి ఏనాడూ జరగలేదు” అని నమ్మినవాడు, “ప్రపంచంలో ఆకలి, దారిద్య్రం వున్నంతవరకూ మార్క్సిజాన్ని సవాలుచేసే దమ్ము ఎవరికీ లే” దని ప్రకటించిన కవుల్లో ఒకరు నిఖిలేశ్వర్. నిరామయ తెలుగుకవితకు సంకేతం, నిరలంకార కవితా రీతికి చిరునామా, నిఖిలేశ్వర్. శబ్దజాల చమత్కారాలు, భాషావైచిత్రితో శిల్పచాతుర్యము చూపకుండా, సహజమైన వ్యక్తీకరణతో సుదీర్ఘకవితాయానం చేస్తున్న అలుపెరుగని నిత్యసాధకుడు నిఖిలేశ్వర్. కుహనావిలువలతో, స్వార్థ ప్రయోజనాలతో పేట్రేగిపోతున్న పాలకవర్గాల దుర్మార్గ దోపిడిల పట్ల నిర్వీర్యంగా పడివున్న తెలుగు సాహిత్య లోకాన్ని ఒక చరుపు చరిచి, ఉలిక్కిపడి కళ్లు తెరిచేలా చేసిన దిగంబర కవిత్వంలో నిఖిలేశ్వర్ సాహితీవ్యక్తిత్వం విలక్షణమయినది.
- Author: Nikhileswar
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 760 pages
- Language: Telugu