Kautilya’S Arthashastra (Telugu) Paperback – 2013
కౌటిల్యుని అర్థశాస్త్రము కార్యనిర్వహణ, అర్థశాస్త్రం మరియు ప్రభుత్వ విత్తం, వర్తకం మరియు వాణిజ్య పద్ధతుల మీద రచింపబడిన ఉధ్రంధం. దాన్ని వందలాది సంవత్సరాల తర్వాత కూడా నేటికీ అన్వయించు కోవచ్చు. అతని భావాల్లోని గొప్పదనం సదా మార్పు చెందుతూ, దూసుకు పోతున్న నేటి ఆర్థిక వ్యవస్థకి నిరంతరం ఆచరణీయంగా ఉండటంలో ఉంది.
- శ్రీ జయంత్ రావ్ పాటిల్, మినిష్టర్ ఫర్ హోమ్ ఎఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర
ప్రస్తుత భారతదేశానికి కౌటిల్యుని అర్థశాస్త్రము యొక్క ప్రాముఖ్యత యొక్క వన్నె తగ్గలేదు ఎందుకంటే తక్కిన విషయాల్లో అది ఒక మతసంబంధము లేని పాఠ్యగ్రంథము. అది బహిరంగంగా ఏ తత్వ శాస్త్రాన్ని లేదా మతాన్ని చూపించకుండా, పరిపాలనా దక్షతని వివరిస్తుంది.
- శ్రీ శ్రీచంద్ పి హిందూజ, ఛెయిర్మెన్, హిందూజా ఫౌండేషన్
300 క్రీ.పూ లో రాయబడిన కౌటిల్యుని అర్థశాస్త్రము పరిపాలన, కార్యనిర్వహణ, అర్థశాస్త్రం మీద అతి పురాతన అత్యంత సమగ్రమైన ఉధ్రంధం.
- శ్రీ అరిందమ్ చౌదరి, డీన్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ అండ్ ఎకనామిక్
రిసెర్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మానేజ్ మెంట్ కౌటిల్యుడు, చాణక్యగా కూడా పేరుపొందినవాడు, భారతదేశపు అన్ని కాలాల రాజకీయ ఆర్థిక
శాస్త్రవేతల్లో అత్యంత ప్రసిద్ధికెక్కిన వారిలో ఒకడు. ఏ రాజకీయ పార్టీ పదవిలో ఉన్నా కూడా ఆర్థిక కార్యక్రమాలను దానికి ఆయువు పట్టుగా భావించాడు. నిజానికి అతను ఎంతదూరం వెళ్ళాడంటే, సైన్యం కన్నా కూడా రాబడికి పెద్ద పీట వేయాలన్నాడు. ఎందుకంటే చక్కగా నిర్వహించిన రాబడి పద్ధతిలోంచి ఒక సైన్యాన్ని పోషించటం సాధ్యమవుతుంది.
పన్నులు విధించే విషయంలో ప్రభుత్వ అధికారాన్ని తగ్గించాలని, తక్కువ మొత్తం పన్నులు విధించాలనీ, పన్నుల మొత్తాన్ని క్రమేపీ పెంచుకు రావాలనీ, చెపుతూ అన్నింటికన్నా ముఖ్యంగా అందరూ పాటించటానికి అనువుగా, ఒక చక్కటి పన్నులరూపాన్ని కనుగొన్నాడు. విదేశీ వర్తకాన్ని గట్టిగా ప్రోత్సహించాడు. ఒక విజయవంతమైన వర్తక ఒప్పందం ' నెలకొల్పాలంటే, అది అందరికీ లాభదాయకంగా ఉండాలన్న ఆనతి మీద ఆధారపడి ఉంది. భూమి, నీరు, గనుల వ్యవహారంలో
ప్రభుత్వ అధికారం, పెట్టుబడులని నొక్కి వక్కాణించాడు.
ఊహకి, అనుభవానికి మధ్య వారధి కట్టిన నిజమైన రాజకీయవేత్త కౌటిల్యుడు. కౌటిల్యునికి మంచి పరిపాలన ఉండటం అత్యంత ముఖ్య విషయం. కౌటిల్యుడు అక్రమ మార్గాలని అరికట్టటానికి వ్యవస్థలోనూ, పద్ధతుల్లోనూ అదుపులు, బేరీజులు అంతర్గంతంగా సూచించాడు. రాజకీయ ఆర్థికవ్యవస్థ మీద కౌటిల్యుడు వెలిబుచ్చిన ఎన్నో భావాలను ఇప్పటికీ అన్వయించుకోవచ్చు.
- Author: Kautilya
- Publisher: JAICO (Latest Edition)
- Language: Telugu
- Paperback: 224 pages