Ruthuvulu Navvayi (Telugu) Perfect Paperback - 2015
రేఖ విద్య భుజాల చుట్టూ చేయివేసి పొదివి పట్టుకుని దగ్గరకి తీసుకుంది.”భయపడకండి అంటీ!డాడీ వున్నారు. అన్నీ చూసుకుంటారు.రవికేం భయం లేదు. వైద్యం జరుగుతోందిగా!” విద్య ఒక్కసారిగా బావురుమంది.
ఆ క్షణంలో రేఖ ఎవరో, ఆ అమ్మాయి పట్ల తన వైషమ్యం ఏమిటో మర్చిపోయింది. రేఖ భుజం మీద తలదాచుకుని ఏడ్చస్తుంది.
“ఆంటీ!ప్లీజ్ ఆంటీ!”రేఖ ఆరిందాలా విద్యని సముదాయిస్తోంది. యశ్వంత్ ఒక్క నిముషం ఆ యిద్దరినీ చూశాడు. అతని కళ్ళు మరు నిమిషంలో రవి ముఖంవైపుతిరిగినాయి. చేయి జారబోతుంటే పైకి సర్ధాడు. ఒకరిపట్ల ఒకరికి మనస్పర్థలు,వైషమ్యాలు,అసంతృప్తులు అన్నీ మర్చిపోయి ఒకరికి ఒకరు తోడుగా నిలిచి,మానవత్వం చూపే క్షణాన యశ్వంత్కి యింకేం గురురావటం లేదు. రవికి ఏదయినా అయితే విద్య బ్రతకదు! రవి బ్రతకాలి! రవిని బ్రతికించుకోవాలి! అదే ఇప్పుడు చాలా ముఖ్యం అనిపిస్తోంది అతనికి.
మొదలుపెడితే తుదివరకూ ఏకబిగిన చదివించే నవల!తప్పక చదవండి
- Author: Yaddanapoodi Sulochanarani
- Perfect Paperback: 280 pages
- Publisher: Emesco Books (2 October 2015)
- Language: Telugu