A Setback Is a Setup For a Comeback (Telugu) Paperback - 2012
పరాజయం విజయానికి సోపానం
మీకెప్పుడైనా పరాజయం సంభవించిందా? • జీవితం మోసగించిందా?
• గడ్డుకాలాలు కృంగదీశాయా? • మీ పరాజయాలను అపూర్వమైన
విజయాలుగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా?
అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకం, నీ జీవితాన్ని మార్చడానికి ఒక నిమిషం చాలు, రాసిన విలీ జాలీ, పరాజయం విజయానికి సోపానం, అనే ఈ పుస్తకంలో మీరు కృషి చెయ్యడానికి, మీ లక్ష్యం సాధించుకోవడానికి స్ఫూర్తినిస్తాడు. వి.డి.ఏ.డి. ఫార్ములా ముందుచూపు, నిర్ణయం, చర్య, కోరిక - జీవితంలో నిరంతరం ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి ఎలా తోడ్పడుతుందో చూపిస్తాడు. మీ అదృష్టం పగ్గాలు మీ చేతుల్లోనే ఉంచుకోవడానికి సాయపడే తన టెక్నిక్ లను మీతో పంచుకుంటాడు. కష్టాల ముందు తలవంచని, అనుకోని ప్రదేశాలలో అవక అన్వేషించిన సాధారణ వ్యక్తుల అనుభవాల గురించి చెపుతాడు. మనోరంజకమైన ప్రసంగాలు, ఉదాహరణలు, కథలతో మీరు మీ శక్తులను కేంద్రీకరించి, కార్యోన్ముఖులు అయేలా చేస్తాడు. విలీ ప్రతిపాదించిన పన్నెండు సరళమైన వ్యూహాలను ఉపయోగించి, మీరు మీ పరాజయాలను విజయాలుగా, సమస్యలను సంభావ్యతలుగా మార్చుకోగలరు. ఇది నిజంగా ఒక 'ప్రేరణాత్మకమైన ఉత్తమ రచన!'.
విలీ జాలీ, ఈ సంవత్సరంలోని ఒక విశిష్ట స్ఫూర్తిదాయక వక్త'.
- టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్
“జాలీ విజయం సాధించాడు....వివిధ రకాల పాఠకుల్ని ఆకర్షిస్తాడు....”
- పబ్లిషర్స్ వీక్లీ
“నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా క్రింది స్థాయిలో ఉన్నప్పుడు,
పైకి ఎలా వెళ్ళాలో, ఎలా బయటపడాలో, ముందు ఎటువంటి మార్గం ఉందో,
ఈ పుస్తకం చూపిస్తుంది. తప్పక చదవవలసిన గొప్ప పుస్తకం."
- లెస్ బ్రౌన్, లిప్ యువర్ డ్రీమ్స్ రచయిత
“పరాజయం విజయానికి సోపానం పుస్తకం చదవడం, మీ సమస్యలను సంభావ్యతలుగా
మార్చుకోవడంలో, మీ సవాళ్ళను అద్భుత అవకాశాలుగా మలుచుకోవడంలో
సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను.”
- వాలీ "ఫేమస్' ఏమస్, వాటర్‌మెలన్ మ్యాజిక్ రచయిత
- Author: Willie Jolley
- Paperback: 203 pages
- Publisher: Manjul Publishing House (New Edition)
- Language: Telugu