Abraham Kovur Jeevitham (Telugu)
డాక్టర్ అబ్రహాం టి. కోవూర్ ఆంధ్రదేశానికి అత్యంత సన్నిహితులు. 1974 నుండీ భారతదేశం అంతటా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నలుమూలలా కోవూర్ విస్తృతంగా పర్యటించి బాబాల బండారాన్ని బయట పెట్టడం ద్వారా గొప్ప సంచలనాన్ని కలిగించి, ఆలోచింపజేశారు.
మూఢనమ్మకాలను రూపుమాపడానికి డాక్టర్ కోవూర్ జరిపిన కృషి ఎంతో గణనీయమైనది.
డాక్టర్ కోవూరకు, నాస్తిక కేంద్రానికి సన్నిహిత సంబంధం వుంది. 1970లో గోరా తన ప్రపంచ పర్యటన చివరి ఘట్టంగా శ్రీలంక రాజధాని కొలంబో వెళ్ళినప్పుడు డాక్టర్ కోవూర్ ప్రత్యేక సభ ఏర్పరిచారు. కోవూర్ ఆంధ్ర పర్యటనలో నాస్తిక కేంద్రానికి వచ్చి గోరా రచించిన “మూఢనమ్మకాలు - నాస్తికదృష్టి" పుస్తకాన్ని ఆవిష్కరించారు. శ్రీ లవణం ఆంధ్రలో కొన్ని సభలలో డాక్టర్ కోవూర్ ఉపన్యాసాలు అనువదించారు.
1975 మే లో శ్రీ లవణం, శ్రీమతి హేమలతా లవణం మూడు వారాలు శ్రీలంక పర్యటించి డాక్టర్ కోవూర్ అతిధులుగా ఉన్నప్పుడు ఆయనతో వివిధ విషయాలు చర్చించడమే కాక, రేషనలిస్టు నాయకులతో సన్నిహిత సంబంధం ఏర్పడింది.
-
Author: Lavanam
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback: 56 Pages
- Language: Telugu