Agniteertham, Seelapariksha- 6 (Telugu) - 2014
అగ్నితీర్థం
భర్త, స్త్రీలోలుడయిన అతడి లాయర్ స్నేహితుడి కుట్రకు బలయి, ముంబై వేశ్యావాటికలో కొంతకాలం
దుర్భరజీవితం గడిపి వచ్చిన చారులత, భర్తకూ, అతడి స్నేహితుడికీ ఎలా గుణపాఠం నేర్పిందో, వారిపై
ఎలా పగ తీర్చుకుందో ఆసక్తిగా కళ్ళకు కట్టించారు. మూల కథాంశం ఇదే అయినా, కథలో ఆసక్తిగా
చదివించే మలుపులనేకం ఉన్నాయి. మంచినీళ్ళలా డబ్బు గుమ్మరించగల స్తోమత చారులతకు
ఎక్కడిది?- అనే సందేహం ఓ దశలో పాఠకుడికి కలుగుతుంది. వ్యభిచారవృత్తి ద్వారా అంతగా
సంపన్నురాలవటం సాధ్యమా?-అనే ప్రశ్న తలెత్తుతుంది. దానికి సంతృప్తికరమైన మలుపును ఇచ్చి
పాఠకుడి సందేహాన్ని తీర్చారు.
శీల పరీక్ష
అనసూయమ్మ తన స్నేహితురాలైన మరియమ్మ మరణానంతరం, ఆమె కూతురు రేణుకను పెంచుతుంది.
రేణుకకి 'శీల పరీక్ష' పేరుతో అన్యాయం జరుగుతుంటే, రేణుక భర్తకీ, ఊరిపెద్దలకూ, స్వార్థపరులకూ ఏ
విధంగా గుణపాఠం నేర్పటానికి అనసూయమ్మ ప్రయత్నించిందో, అత్యంత ఉత్కంఠభరితంగా
చిత్రించారు రచయిత.
- Author: Kakani Chakrapani
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 400 pages
- Language: Telugu