Bashaye Tudu (Telugu) - 2018 - Chirukaanuka

Bashaye Tudu (Telugu) - 2018

Sale price ₹ 115.00 Regular price ₹ 120.00

.. పీడిత, తాడిత జన విముక్తి కోసం నడుంకట్టిన సున్నితమైన వ్యక్తులు నా రచనల్లో కీలక పాత్రధారలుగా కనిపిస్తారు. ... జీవితం అంకగణితం కాదు. మనిషి రాజకీయ క్రీడ కోసం రూపొందలేదు. తన హక్కులన్నీ చెక్కుచెదరకుండా హాయిగా జీవించాలన్న మనిషి తపనను సఫలం చెయ్యాలన్నదే ప్రతి తరహా రాజకీయాలకూ ధ్యేంగా వుండాలని నేను నమ్ముతాను. పార్టీ ప్రయోజనాల పెంపుదలకు మాత్రమే పరిమితమైన రాజకీయాలు వర్తమాన సామాజిక వ్యవస్థను మార్చగలవంటే నేను నమ్మను.
స్వాతంత్య్రం సిద్ధించిన నలభై ఒక్క (...)  ఏళ్ల తరువాత కూడా తిండికి, నీళ్లకు, భూమికి నోచుకోక అప్పుల్లో కట్టుబానిసత్వంలో నా దేశ ప్రజలు అల్లాడి పోవడం నా కళ్లతో చూస్తున్నాను. ఈ అమానుష నిర్బంధాలనుంచి నా ప్రజల్ని విముక్తుల్ని చెయ్యలేని వ్యవస్థకు వ్యతిరేకంగా జాజ్వల్యమాన సూర్యబింబంలా ప్రజ్వరిల్లుతున్న ఓ ఆగ్రహమే నా రచనలన్నింటికీ ప్రేరణ, స్ఫూర్తి.

  • Author: Mahaswetha Devi
  • Publisher: Hyderabad Book Trust  (Latest Edition)
  • Paperback: 138 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out