Bhagavanthuni Sannidilo Bhaktulu (Telugu)

Bhagavanthuni Sannidilo Bhaktulu (Telugu)

Regular price ₹ 100.00

భారతదేశం వేదభూమి. మానవ దౌర్భల్యాల్ని రూపుమాపి, శాశ్వతత్త్వమైన అమృతత్త్వాన్ని ప్రసాదించగల వాఙ్మయాలకు నిలయం. ఆత్మయొక్క అమృత స్వరూపాన్ని సాక్షాత్కరించుకుని, దేహభ్రాంతిని వీడి, ఆత్మనిష్ఠాగరిష్ఠులై, ఆత్మ సంయమనంతో అనంతత్త్వాన్ని అనుభూతం చేసుకున్న మహనీయులకు ఆలవాలం ప్రాచీన భారతదేశం. అయితే నేటి నవీన సమాజం భోగాసక్తినే పరమపురుషార్థంగా భావిస్తూ, ఇంద్రియ సుఖాన్నే పరమావధిగా పరిగణిస్తూ, పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో పడి తన దివ్యాత్వాన్ని గుర్తించలేకుండా, నైతిక విలువలను కోల్పోయి, నిర్జీవమై అజ్ఞాన అంధకారంలో అలమటిస్తూ మనుగడ సాగిస్తోంది. స్వధర్మాచరణాన్ని చిత్తశుద్ధితో ఆచరించే గృహస్థులే ఉత్తమ సమాజనిర్మాతలు కాగలరు. గృహస్థాశ్రమ ధర్మాలలో కీలకమైనది సాధుసేవ, సజ్జన సాంగత్యము. ‘భగవంతుని సన్నిధిలో భక్తులు’ అనే ఈ గ్రంథంలో శ్రీరామకృష్ణుల అవతార కార్యాన్ని సువ్యక్తం చేయడంలో కీలకపాత్ర వహించిన ముప్ఫై ఒక్క మంది శ్రీ రామకృష్ణుల గృహస్థ శిష్యుల, శిష్యురాండ్ర జీవిత చరిత్రలు పొందుపరచబడ్డాయి. శ్రీరామకృష్ణుల పావన సాంగత్యంలో వారి జీవితాలను ఎలా మలుచుకున్నారో తెలియజేసే గ్రంథం.

  • Author: Swami Chetanananda
  • Publisher: Ramakrishna Matham (Latest Edition)
  • Paperback: 576 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out