Bharatiya Rushulu (Telugu)
భారతీయ వాఙ్మయంలో నిత్యసత్యాలైన ప్రమాణాలు వేదాలు. ఆ వేదాలలో ఉన్న జ్ఞానరాశిని మానవజాతి మనుగడకై అందించిన ఋషులు గురించి తెలుసుకోవాలంటే చరిత్రరూపమైన సాక్ష్యం లేనట్టి పురాతనకాలానికి వెళ్ళాల్సిందే. ఆ ప్రాచీనకాలపు అంధకారంలో దాగిన రహస్యాలను వెలువరించడానికి భారతీయ ఋషులు చేసిన కృషి శ్లాఘనీయం. వారు అందించిన నిత్యసత్యాలు జాతీయ జీవన విధానాన్ని సరైన దిశలో నడిపించాయి కాబట్టి అంతటి మహిమాఢ్యులైన పూర్వీకులు, ఋషుల సంతతికి చెందినవారమని ప్రతీ భారతీయుడు గర్విస్తాడు. భారతదేశం జన్మించింది రక్తసిక్తమైన కత్తులతో కాదు, ఋషులు ధ్యానంలో దర్శించిన పారమార్థిక సత్యాల ద్వారా. సర్వసంగ పరిత్యాగులు, కౌపీనధారులైన ఋషులు, వారికంటూ ప్రపంచంలో ఏమీ లేనప్పటికీ యావత్ మానవాళి హృదయాలను చూరగొన్నారు. అంతేకాదు వీరిలో విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన ఆవిష్కరణలు చేసినవారూ ఉన్నారు. వీరు మా పూర్వీకులని చెప్పడానికి ఈ జాతి గర్విస్తుంది. ఈ ఋషిపుంగవుల ముందు మార్గదర్శనం కోసం మహాయోధులైన రాజులు మోకరిల్లేవారు.
-
Author: Aparna Srinivas
- Publisher: Ramakrishna Matham (Latest Edition)
-
Paperback: 154 Pages
- Language: Telugu