Bhavanni Anatamondichaleru (Telugu)
బిజెపి కేంద్రంలో అధికార పీఠాన్ని అధిరోహించిన నాటి నుంచి దేశంలో అసహనం బరితెగించింది. హిందూత్వవాదులు పెచ్చరిల్లి పోతున్నారు. అభ్యుదయ, ప్రజాతంత్ర శక్తులపై, వ్యక్తులపై ప్రచార దాడులకే పరిమితం కాకుండా, భౌతిక దాడులు, హత్యలకు సైతం పాల్పడుతున్నారు. తాజాగా బెంగుళూరు నగరంలో సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య, పద్మావతి సినిమాను నిషేధించమని డిమాండ్ చేస్తూ వారు జరిపిన దౌర్జన్య కాండ, ఆ చిత్రనటీనటులు, దర్శకుని తలలకు నజరానాలు ప్రకటించడం ఉదాహరణలు. త్రిపురలో మరో జర్నలిస్టు శంతన్ భౌమిక్ హత్య. ఇంతకు ముందు దభోల్కర్, పన్సారె, కల్బుర్గీ లాంటి అభ్యుదయ, వామపక్ష, సామాజిక, సాహిత్యకారులను హత్య చేశారు. ఇలాంటి హత్యలను ఖండించిన ప్రకాష్‌రాజ్ వంటి సినీరంగ ప్రముఖులనూ హిందూత్వ మూకలు వదిలి పెట్టడంలేదు. ప్రగతిశీల ప్రజాస్వామిక వాదులందరూ ఇలాంటి ఫాసిస్టు దాడులను ముక్త కంఠంతో ఖండించి, సంఘీభావం ప్రకటించాల్సి ఉంది. అలాంటి స్పృహను పెంచేందుకు దోహదపడేదే ఈ పుస్తకం.
- Author: Navatelangana Publishing House
- Publisher: Navatelangana Publishing House (Latest Edition)
-
Paperback: 64 Pages
- Language: Telugu