Brathuku Bongaram (Telugu) - 2010 - Chirukaanuka

Brathuku Bongaram (Telugu) - 2010

Sale price ₹ 65.00 Regular price ₹ 70.00

తొలిరాత్రి రవిచంద్ర తన భార్య మూగదని తెలుసుకుంటాడు.  అమ్మలేని తనని చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచిన తండ్రి కూడా ఈ విషయంలో మోసంచేశాడనీ,లోకంలో మంచికి స్థానం లేదనీ,గమ్యం లేని గమనం వైపు సాగిపోతాడు.
ట్రైన్‌లో ప్రియంవద,రాజగోపాలం పరిచయం అవుతారు. ఎటువెళ్లాలో తెలియక చివరకు నాగపూర్‌లో దిగిపోతాడు.అక్కడ నాటకాల్లో వేషాలు వేసే చిన్ననాటి స్నేహితుడు సురేంద్ర కలుస్తాడు.అతని ద్వారా సురేఖ అనే నటి కూడా పరిచయం అవుతుంది.అలా గమ్యం లేకుండా సాగిపోతున్న జీవితానికి  వీళ్లతోడ్పాటుతో ఓగమ్యం ఏర్పడుతుంది. ఐఏఎస్‌ పాసై నాగపూర్‌కు అసిస్టెంట్‌కలెక్టర్‌గా వస్తాడు. అలా తనవాళ్లందరి మధ్య ఆనందంగా ఉండాల్సిన తను, సురేఖకు బ్రోతల్‌యాక్ట్‌ కింది శిక్ష వేయాల్సిన అవసరమే మొచ్చింది. సురేంద్రను 'సురేఖ' హత్యానేరం మీద ఎందుకు పోలీసులకు పట్టించాడు. తననెంతో ఆదరించిన ప్రియంవదగారి మీద అత్యాచారయత్నం ఎందుకు చేయాల్సి వచ్చింది.... విధి బలీయం అంటారు. మరి ఇది విధి ఆడిన నాటకమా? తెలుసుకోవాలంటే తప్పక చదవండి. విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రశంసలు పొందిన నవల బ్రతుకు బొంగరం.

  • Author: Ravulapati Sitharam Rao
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 176 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out