Chitikalo Chikitsa (Telugu) Paperback – 21 October 2022
Chitikalo Chikitsa (Telugu) Paperback – 21 October 2022
కొన్ని ఐడియాలు జీవితాన్ని మార్చేస్తుంటాయి. ఈ అనంత విశ్వంలో గ్రహాలు, గ్రహశకలాలు ఎన్ని ఉన్నాయో, ఈ భూమండలం పైన గాలిలో రేణువులు, పరమాణువుల ఎన్ని ఉన్నాయో ఐడియాలు అన్ని ఉన్నాయి. ఒక కొత్త ఆలోచనకు మనం ప్రవర్తించగలిగినప్పుడు నిజంగానే తగ్గట్టుగా చిటికలో మహత్తులు కన్పిస్తాయి. ‘దానం’ చేయాలనే ఆలోచన రావటం మంచిదే! కాని, దానం చేసినప్పుడు కదా… ఆ ఆలోచన ఫలించేది! ‘చిటికలో చికిత్స’ పుస్తకం ఇలాంటి వందలాది ఆలోచనలను అందిస్తోంది. వాటిని ఉపయోగంలో పెట్టినప్పుడు ఫలితం కనిపిస్తుంది. షుగరు వ్యాధిలో పులుపొక్కటి తగ్గించేస్తే, ఉప్పు, కారం, నూనె, తీపి ఇలాంటివి తగ్గించి తినడనికి అవకాశం ఏర్పడుతుందన్నది ఒక ఆలోచన. ఉప్పు – కారాల బెడదని తగ్గించుకోవాలంటే, వేపుడు కూరలను మానేయడం ఒక ఆలోచన! బీపీ బారిన పడకుండా ఉండలంటే, ముఖానికి చిరునవ్వు తెచ్చి అంటించుకోవటం ఒక ఆలోచన. రోగం వచ్చినప్పుడు ”ఏం తినమంటారు?” అని అడగటం పాత ప్రశ్న. ఏది తినటం మానేయాలని అడగటం ఒక ఆలోచన!! తినే వాటివలనే గాని, తినని వాటి వలన రోగాలు రావు కదా! అందుకని, మానటానికే ప్రాధాన్యం ఇవ్వాలి. తినవలసినవి మాత్రమే తినటం చికిత్స!
- Author: Dr. G.V.Purnachandu
- Publisher: Mohan Publication (21 October 2022)
- Language: Telugu
- Paperback: 304 pages