Cinema Musings Perfect Paperback – 1 January 2022
Cinema Musings Perfect Paperback – 1 January 2022
ఆన్వీక్షకి అనే ప్రచురణ సంస్థ స్థాపించడానికి మొలకెత్తిన ఆలోచనల్లో ముఖ్యమైనది - "సినిమాలు మనవి వాళ్లవీ" పుస్తకం. పదేళ్ల క్రితం తెలుగులో రావాల్సినంతగా సినిమా సాహిత్యం లేదనే ఆలోచనతో సత్యజిత్ రే రాసిన "Our Films - Their Films" పుస్తకాన్ని తెలుగులోకి అనువదించి ప్రచురించాము. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆన్వీక్షకి సంస్థ స్థాపించాక సినిమాకి సంబంధించిన పుస్తకాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఇప్పటివరకూ ఆరు సినిమా పుస్తకాలు ప్రచురించాం. కానీ స్వరూప్ రాసిన 'సినిమా మ్యూజింగ్స్' చాలా ప్రత్యేకం. బ్యూటీ ఆఫ్ సినిమా, పవర్ ఆఫ్ సినిమా ఏంటో ఈ పుస్తకం చదివితే మీకే తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఎన్నో అద్భుతమైన సినిమాల గురించి తనదైన ప్రత్యేకమైన శైలిలో ఈ వ్యాసాలను రాసారు స్వరూప్ తోటాడ. ఆన్వీక్షికి ప్రచురించిన 'అనైటిల్డ్'తో రచయితగా తెలుగు సాహిత్యలోకానికి పరిచయమైన స్వరూప్ ఈ పుస్తకంతో మంచి వాక్యాన్ని ఆస్వాదించే పాఠకులతోపాటు, మంచి సినిమాలు చూసే ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటారనే నమ్మకం మాకుంది. వెంకట్ శిద్దారెడ్డి
-
Author: Swaroop Thotada
- Publisher: Anvikshiki Books (1 January 2022)
-
Paperback: 174 Pages
- Language: Telugu