Daily Inspiration By Robin Sharma (Telugu) Paperback –  2015 - Chirukaanuka

Daily Inspiration By Robin Sharma (Telugu) Paperback – 2015

Sale price ₹ 199.00 Regular price ₹ 225.00

“రాబిన్ శర్మను అనుసరించే వారి సంఖ్య దలైలామా అనుచరుల సంఖ్యతో పోటీ పడుతోంది." - ది టైమ్స్ ఆఫ్ ఇండియా
"అంతర్జాతీయ మానవతావాది." - సిఎన్ఎన్

మనందరికీ నిత్య ప్రేరణ అవసరం.

మనం చేసే పని, మన జీవనం ప్రతిభావంతంగా ఉండటానికి, మనకు ఆత్మీయమైన కలలను సాకారం చేసుకోవడటానికి, మనం కోరుకున్న వ్యక్తిత్వంతో ఎదగటానికీ, కష్టకాలాన్ని అధిగమించటానికీ, జీవితంలో అత్యుత్తమ క్షణాలను ఆస్వాదించటానికి మనందరికీ నిత్య ప్రేరణ అవసరం.

ఐతిహాసిక నాయకత్వం, దక్షతలలో ప్రవీణులు రాబిన్ శర్మ తన ఫెరారీని అమ్మిన సాధువు కలిగించే 'నిత్య ప్రేరణ'లో అంతర్జాతీయంగా అత్యధిక అమ్మకాలు సాధించిన తన 'ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ', ఆ 'కమంలో వచ్చిన ఇతర పుస్తకాలనుంచీ అత్యంత ప్రబలమైన ఆలోచనలను వడకట్టి - మీ జీవితంలో ప్రతి ఒక్క రోజునూ మహా మేధ స్థాయికి చేర్చటానికి అనువుగా - సరళంగా చదువుకోదగిన క్యాలెండర్ రూపంలో తీర్చిదిద్దారు.

విశిష్ట సఫలత సాధించటం, ప్రతికూలతను, ఆశాభంగాన్ని అధిగమించటం, పటిష్టమైన
బాంధవ్యాలు నెలకొల్పటం, ఈ లోకంలో మీ ప్రభావాన్ని పెంచటం వంటి ముఖ్యాంశాలు
పొందుపరిచిన ఈ పుస్తకం అసాధారణ వ్యక్తులు కావటంలో, చివర్లో గర్వపడే విధంగా జీవనం కొనసాగించటంలో మీ బాటన ఆజన్మ సహవాసి అవుతుంది.

రాబిన్ శర్మ ప్రపంచమంతటా ఆదరణ పొందిన మానవతావాది. ఉన్నత నాయకత్వానికి, వ్యక్తిగత సామర్ధ్యాన్ని పెంపొందించటానికి అత్యున్నత సలహాదారులుగా ఆయన ప్రపంచ మంతటా పేరుపొందారు. ప్రసిద్ధి చెందిన కోటీశ్వరులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రీడాకారులు, అనేక ఫార్ట్యూన్ 100 సంస్థలు ఆయన ఖాతాదారులు. అగ్రస్థానం అధిష్టించిన ఆయన రచనలు 'దిమాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ' (తన ఫెరారీ అమ్మిన సాధువు), 'ది గ్రేట్నెస్ గైడ్' (ఘనతకు మార్గం), 'ది లీడర్ హూ హాడ్ నో టైటిల్' (పదవి బిరుదు లేని నాయకుడు), ప్రపంచంలో 92 భాషలలో ప్రచురణ పొందాయి. ఈ రచనలు ఆయనను ప్రపంచమంతటిలోను అత్యధిక పాఠకులు గలరచయితగా నిలబెట్టాయి.

మరింత ఉత్తేజానికి, మీ జీవితాన్ని మహత్తరం చేసుకోవటంలో మరిన్ని వనరుల కోసం  దర్శించండి.

  • Author: Robin Sharma
  • Paperback: 224 pages
  • Publisher: Jaico Books (Latest Edition)
  • Language: Telugu

Customer Reviews

Based on 1 review Write a review

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out