Dalitha Sahityaadam Jashuva (Telugu)
హిందూ సామ్రాజ్యవాదంపై రాజకీయ సాంస్కృతిక విప్లవం చేయాలంటే తప్పక సామాజిక సామ్యవాద శక్తులు తమలోని పాజిటివ్ అంశాలను కలుపుకొంటూ ఐక్యమౌతూ పోరాటాన్ని కొనసాగించవలసిందే. - డా|| కత్తి పద్మారావు
దళిత వాదమంటే ఏమిటి? దళిత సాహిత్యవాదమంటే ఏమిటి? వాటి తాత్త్విక భూమిక ఏమిటో చర్చించవలసిన బాధ్యత మనమీదవుంది. భారతావనిలో సాంఘీకంగా, ఆర్థికంగా అణగద్రొక్కబడిన వారంతా దళితులే. ప్రధానంగా యస్.సి.లు, యస్.టి.లు, బి.సి.లు ఈ కోవకు వస్తారు. మైనారిటీలు హిందూ యేతర మతాల్లో ఉన్నారు కనుక మైనారిటీలు కూడా ఈ కోవలోకే వస్తారు. స్త్రీలు ఏ వర్ణంలో వున్న ఏ కులంలో వున్న అణగద్రొక్క బడుతున్నారు కనుక వారూ ఈ కోవలేకే వస్తారు. దీనిని బట్టి దళితులంటే యస్.సి., యస్.టి., బి.సి., మైనారిటీలు, స్త్రీలు అనేది స్పష్టమౌతుంది. అయితే దళితవాదమంటే ఏమిటి? అంటే ఆయాకాలాల్లో సాంఘిక అంశం పునాదిగా అణగద్రొక్కబడిన కులాలవారు, అగ్రకులాల పెత్తనం క్రింద రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా అణగద్రొక్క బడ్డారు. వీరిని అణచివేసిన అగ్రకులాలకు ఒక తాత్త్వికపునాది వుంది. అది హిందూ మతవాద తాత్త్విక పునాది. వీరికి ఒక సాంఘిక దృక్పధం వుంది. అది కుల అసమ సమాజ నిర్మాణం, వీరికి ఒక ఆర్థిక రాజకీయ పునాదివుంది. అది క్రింది వారిని విభజించడం ద్వారా, చైతన్య రహితులను చేయడం ద్వారా ప్రకృతి వనరుల మీద, శ్రమ సంస్కృతి మీద ఆధిపత్యం వహించి తద్వారా ప్రభుత్వ రాజ్య యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోగలగడం అయితే ఈ అగ్రకుల వాదాన్ని హిందూ వాదమని, హిందూ సామ్రాజ్యవాదమని మనం పిలుస్తున్నాం. ఇప్పుడు మన సమాజం వీరి పెత్తనంలోనేవుంది......
-
Author: Kathi Padmarao
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu