Darvin Parimavadam (Telugu)
మానవ జాతి విజ్ఞానాభివృద్ధి క్రమాన్ని కీల మలుపుతిప్పిన గొప్ప గ్రంథం చార్లెస్ డార్విన్ రచించిన 'జాతుల ఆవిర్భావం'. నిజానికి డార్విన్ తన గ్రంథానికి పెట్టిన పూర్తి పేరు 'ప్రకృతి వరణం ద్వారా జాతుల ఆవిర్భావం' ( The Origin of Species by Means of Natural Selection). ప్రకృతి వరణం (ఎంపిక) ద్వారా అనేది టాగ్. ఆ గ్రంథంలో డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతం అప్పటివరకు జీవుల పుట్టుకకు సంబంధించి మానవుని ఆలోచనలను సమూలంగా మార్చేసింది. భూమ్మీద జీవ జాలాన్నంతటినీ, మానవునితో సహా దేవుడు సృష్టించాడనేది అప్పటివరకు ఉన్న అభిప్రాయం. ఈ అభిప్రాయంతో విభేధించే వారు లేరని కాదు. ప్రాచీన భారత దేశంలోనూ, గ్రీసులోనూ జీవజాలం పుట్టుకను భౌతికవాద దృష్టితో వివరించిన వారు అనేక మంది ఉన్నారు. చార్వాకులు దేవుని ఉనికిని పూర్తిగా తిరస్కరించారు. బౌద్ధులు పరిణామాన్ని పూర్తిగా భౌతిక వాద దృష్టితో ప్రతిపాదించారు. అనేక మంది గ్రీకు పండితులు ప్రకృతీ, దానిలోని జీవజాలం పదార్థం యొక్క పరిణామ క్రమంలో ఆవిర్భవించినవేనని చెప్పారు. అయితే వారంతా తత్వవేత్తలు. తమ వాదనలను తాత్వికంగా వివరించారే తప్ప రుజువులు చేయలేకపోయారు. రుజువు చేయడానికి నాడు సైన్స్ అంతగా అభివృద్ధి చెందలేదు.
-
Author: C.V
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback:
- Language: Telugu