Devuni Puttu Purotvalu (Telugu)
దైవం ఉనికిని నమ్మని వారు నాస్తికులు. దేవుడు సర్వంతర్యామిగా గాని, ఏ రూపంలోగాని లేరన్నది వారి వాదన. యుగయుగాలుగా మానవ శక్తులకు అతీతమైన శక్తి ఉందని నమ్మేనాటికే అటువంటి శక్తి లేదని నమ్మేవారూ ఉన్నారు. కార్యాకారణాలు తెలియడం వలన జ్ఞానం పెరుగుతుంది. అపోహలు, భయాలు తొలగిపోతాయి. కొత్త జ్ఞానం, కొత్త భయాలనూ కల్పించవచ్చు. మరింత జ్ఞానంతో ఈ కొత్త భయాలూ తొలగవచ్చు. తెలుసుకోవలసిన విషయాలు ఉన్నన్ని రోజులూ అందుకు సంబంధించిన భయాలూ, ఆందోళనలూ ఉంటాయి. ఆ భయాలను అధిగమించేందుకు 'దైవం' ఆసరా మానవులు తీసుకుంటారు. నాస్తికులు జ్ఞానాన్వేషణ ఆసరా తీసుకో మంటున్నారు. అందుకై గోరా నాస్తిక కేంద్రాన్ని స్థాపించి తన జీవితకాలం శాస్త్రీయ దృక్పథం పెంచేందుకు ఎంతో కృషిచేసారు.
ఈనాడు ఒకవైపు శాస్త్రీయ జ్ఞానం పెరుగుతున్నా ఆజ్ఞానాన్ని నిజజీవితంలో అన్వయించుకోక పోవడం సర్వసాధారణంగా మారింది. ఉదాహరణకి సూర్యుడే ఒకనాడు 'శక్తి'కి మూలం. నీటి నుండి, గాలి నుండి, అణువుల నుండి, వ్యర్థాల నుండి, రకరకాల ఇతర పద్ధతులలో శక్తిని వెలికితీసి ఉపయోగించుకుంటున్నా ఈనాటికీ 'శక్తి' ప్రాధాన్యతలో సూర్యునిదే ప్రథమ స్థానం. 'శక్తి'నిచ్చే ఇతర పదార్థాలను కొలవం! సూర్యుడిని కొలుస్తాం!!
-
Author: Gora
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback: 32 Pages
- Language: Telugu