Drawing Nerchukondi (Telugu)
Regular price
₹ 70.00
టీవీ'గా అందరికీ తెలిసిన చిత్రకారుడు. కార్టూనిస్టులలో ప్రముఖ కార్టూనిస్టుగానూ, చిత్రకారులలో చిత్రకారుడుగానూ, రచయితగాను, చిత్రకళా వుపాధ్యాయుడుగానూ, చిత్రకళల గురించిన రచయితగాను, కళావిమర్శకుడుగానూ మనకందరకూ సుపరిచితుడు.
కార్టూన్‌లలోనే గాక పెయింటింగ్‌లలో కూడా టీవీ సామాజిక స్పృహ గల చిత్రకారుడు. ఈ వ్యవస్థ పరిణామంలో వుద్భవిస్తున్న సాంఘిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై స్పందించి చిత్రాలు వేస్తాడు. ఈయన చిత్రాలు భావగర్భితంగాను, సందేశాత్మకంగానూ వుంటాయి. సమాజం పట్ల చిత్రకారుడికి బాధ్యత వుండాలంటాడు టీవీ. అందుకే టీవీని ప్రజా చిత్రకారుడనీ, అభ్యుదయ చిత్రకారుడనీ అంటారు.
టీవీ తన 40 సంవత్సరాల చిత్రకళ అనుభవంతో, తాను చదివిన అనేక చిత్రకళా గ్రంథాల పరిజ్ఞానంతో, 20 యేళ్ల చిత్రకళా బోధన అనుభవంతో ఈ పుస్తకాన్ని రచించాడు. తెలుగు భాషలో ఇలాంటి పుస్తకం ఇంతవరకు లేదు.
-
Author: T.V
- Publisher: Pallavi Publications (Latest Edition)
-
Paperback:
- Language: Telugu