Jeevinchu - Neerchuko - Andinchu (Telugu) - 2016 - Chirukaanuka

Jeevinchu - Neerchuko - Andinchu (Telugu) - 2016

Sale price ₹ 239.00 Regular price ₹ 250.00

శరీరమాద్యం ఖలు ధర్మసాధనం’ అనే కొటేషన్‍ (సూక్తి) మా ఇంటి దూలం పక్కన చాక్‍పీసుతో రాసి ఉండటాన్ని నేను చదివాను. అప్పడు నా వయసు ఏడు సంవత్సరాలు కావచ్చు. నేను రెండో తరగతిలో ఉండి ఉండవచ్చు. రాసిన వారెవరో ఆ కొటేషన్ రచయిత పేరు రాయలేదు.
భూమిలో పడ్డ విత్తనం తీరుగా - ఆ కొటేషన్ నా మనసులోపడ్డది అర్థమయీ కానట్టు - బోధపడీ పడనట్టు. దాని అర్థం ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలనే జిజ్ఞాస నాలో ప్రారంభమైంది. దాని అర్థం గురించి నేనెవరినీ అడగలేదు. వయసుపెరుగుతున్నకొద్దీ, జీవితానుభవాలు కలుగుతున్నకొద్దీ, జీవితాన్ని గమనిస్తున్నకొద్దీ ఆ కొటేషన్ రోజూ నా కేదో బోధిస్తున్నట్టుగానే ఉండేది. శరీరం - ఆరోగ్యం - తిండి - వ్యాయామం వంటి విషయాలే కాదు, శరీరానికీ, జీవితానికీ ఉండే సంబంధం ఎటువంటిదో, అటువంటి శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, దానికోసం ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో నిత్యం నాకేదో ఎరుక పరుస్తున్నట్టుగా ఉండేది. ఆ కొటేషన్ చిన్నదేకాని, మొత్తం జీవితం పొడుగునా నన్ను చైతన్య పరుస్తూ వస్తూనే ఉంది. అది మొదలు నాకు కనిపించిన ప్రతి కొటేషన్‍నీ చదువుతూ వచ్చేవాణ్ణి. నాకు సాహిత్యం పట్ల - ఆసక్తి ఆ కొటేషన్‍తోనే ప్రారంభమైందని చెప్పాలి.

  • Author: Thummeti Raghothama Reddy
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 488 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out