Kashmira Rajatharangini Kathalu (Telugu) - 2006 - Chirukaanuka

Kashmira Rajatharangini Kathalu (Telugu) - 2006

Sale price ₹ 85.00 Regular price ₹ 90.00

కథలు కల్హణ విరచితమైన 'కశ్మీర రాజతరంగిణి' ఆధారంగా రాసిన కథలు. కల్హణుడు 11వ శతాబ్దంవాడు. ఈనాటి చరిత్రకారులకే మాత్రం తీసిపోకుండా అనేక పరిశోధనలు చేసి, శిలాశాసనాలు తవ్వి, వెలికి తీయించి, చదివి, దేశమంతా విస్తృతంగా పర్యటించి, సేకరించిన గ్రహించిన కశ్మీర రాజుల చరిత్రను కల్హణుడు 'కశ్మీర రాజతరంగిణి'లో పొందుపరచాడు.కల్హణుడు, ఈనాటి చరిత్రకారుల వైజ్ఞానిక పరిశోధనలకేమాత్రం తీసిపోకుండా పరిశోధనలు చేసి, నిజాన్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, ఉన్నదున్నట్టు తన రచనల్లో ప్రతిబింబించాడు. ఎటువంటి రాజాశ్రయం పొందకుండా, కేవలం చరిత్రను భావితరాలకు సజీవంగా అందించాలన్న తపనతో కల్హణుడు రాజతరంగిణిని రచించాడు. సాహిత్యకారుడికి ఉండే సామాజిక బాధ్యతను సంపూర్ణంగా నిర్వహించాడు.
కల్హణుడు 7836 శ్లోకాలలో పొందుపరచిన కశ్మీర రాజుల చరిత్రను 15 కథలలో ప్రదర్శించే ప్రయత్నం చేశాను. సముద్రంలోని నీటిచుక్క సముద్ర నీటిసారాన్ని ప్రతిబింబించిన రీతిలో, రాజతరంగిణి సారాన్ని ఈ 15 కథలలో సూక్ష్మంగా ప్రతిబింబించే ప్రయత్నంచేశాను.

  • Author: Kasturi Muralikrishna
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 244 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out