Kidnap (Telugu)
శ్రీ ఆహమద్ బాషా గారు వ్రాసిన కిడ్నాప్ నవలిక క్షుణ్ణంగా చదివాను. ఒక మాజీ అటవీశాఖాధికారి గానే కాకుండా ఒక అటవీ ప్రేమికునిగా కూడా ఈ నవలిక నాకు ఎనలేని, తృప్తిని, ఆనందాన్ని కలిగిస్తుంది.
రచయిత ఒక గొప్ప ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతి సౌందర్యాన్ని సహజసిద్ధంగా, ఎలాంటి ఉత్ప్రేక్షలకు పోకుండా చిత్రీకరించడం హృద్యమంగా ఉంది. ప్రస్తుత దేశ పరిస్థితుల ముఖ్య సమస్యలపై అద్దం పట్టినట్లు ఈ రచన సాగింది. ఈ కథా వస్తువు శేషాచల అరణ్యంలోనే వారం రోజులు ఉత్కంఠతో సాగి అడవి వెలుపల ముగింపబడింది. మూడు లక్షల చదరపు కిలోమీటర్లు వ్యాపించిన శేషాచల అరణ్యంలో ఎటువంటి మానవ నివాసాలు, గిరిజనులవి కూడా లేకుండా ఉండటం ఒక ప్రత్యేకత. అందువల్ల శేషాచల దళం, కథానాయకుడిని కిడ్నాప్ చేసి ఒక వారం రోజులు రహస్యంగా ఈ అడవులలో ప్రభుత్వానికి దొరకకుండా దాచి ఉంచగలిగిన సంఘటనలు, రచయితకున్న విశేష శేషాచల అడవుల పర్యాటనానుభవం వల్ల కళ్ళకు కట్టినట్లు వర్ణించగలిగారు. ఆ కొండాకోనలు, చెట్టూచేమలు, జంతుజాలాన్ని, అందమైన నైసర్గిక స్వరూపాన్ని సహజంగా చిత్రీకరించగలిగారు.
- Author: Shaik Ahamad Basha
- Publisher: Vishalandra Publishing House (Latest Edition)
- Paperback: 139 Pages
- Language: Telugu