Konni Kalalu Konni Samayalu (Telugu)
సమాజంలో ఎక్కడ ఏ కొద్దిపాటి అవకతవకలు జరిగినా ముందు కవులూ, రచయితలు స్పందిస్తారు. తమ స్వరాన్ని వినిపిస్తారు. వారి వల్ల, వారి అక్షరాల వల్ల విప్లవాలు, సంస్కరణలు, మేళ్ళు నేరుగా జరగకపోవచ్చు కాని చైతన్యవంతుల్ని చేయడంలో వారు ముందుంటారు. వారి అక్షరాలు ముందుంటాయి. సృజన కారులకు అడ్డుగోడలు పనికిరావు. వారు విశ్వమానవులు! మానవీయ విలువల్ని కాపాడుతూ వచ్చిన కొంతమంది సాహితీ మహనీయుల జీవితాల్ని, వారి సృజనాత్మక కృషిని ఈ పుస్తకంలో గుర్తు చేసుకోవడం జరిగింది. ఇందులో ఎకడమిక్ విభజనలేవీ లేవు. ఇందులో చేర్చని మహాకవులు, రచయితలు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారి గూర్చి నేను రాయకపోవడం వల్ల చేర్చలేకపోయాను. ఇందులో తెలుగు రచయితలు, భారతీయ రచయితలు, విదేశీ రచయితలు అని మూడు బాగాలుగా విభజించాను. పక్కపక్కనే ఉండడం వల్ల సాహిత్యకృషి పోల్చి చూసుకోవడానికి, బేరీజు వేసుకోవడానికి, అధ్యయన పరులకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకున్నాను. చదవడం తగ్గించిన నేటి తరానికి వ్యక్తిత్వ వికాస దిశగా కొంతలో కొంతయినా, ఈ పుస్తకం - అక్షరం గురించి, అక్షర యోధుల గురించి, వారి తపన గురించి, వారు నిలబెట్టాలనుకున్న జీవిత విలువల గూర్చి తెలియజేస్తుందని ఆశిస్తున్నాను.
- డా. దేవరాజు మహారాజు
- Author: Dr. Devaraju Maharaju
- Publisher: Vishalandra Publishing House (Latest Edition)
- Paperback: 318 Pages
- Language: Telugu