Kovvali Navalalu- 3 (Telugu) - 2012
గుడ్డిదర్బార్,తీరనికోరిక,వాగ్దానం,పువ్వులపిల్ల
వందేళ్ల కిందట 1912లో ఆంధ్రదేశంలోని తణుకులో శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారు జన్మించారు. పాతికేళ్లు కూడా పూర్తికాకముందే 1935లో ‘పల్లెపడుచు’ అనే నవలను రచించారు. ఆ తర్వాత మహావేగంతో సంవత్సరానికి వందనవలల చొప్పున 30వ ఏట అడుగుపెట్టేనాటికి 600 నవలలు రచించారు.
ఒక జీవనకాలంలో వేయినవలలు రచించిన నవలారచయిత లెందరు? కొవ్వలి ఒక్కరేనేమో. వీరి చివరి నవల ‘మంత్రాలయ’.
అతి సరళమైన శైలిలో సూటిగా కథను నడపడం కొవ్వలి ప్రత్యేకత. ఆధునిక జీవితానికి అద్దంపట్టే రచనలు చేశాడు. రమ్యమైన కథనంతో నీతిబోధను జోడించాడు.
తన నవల నెల తిరగక ముందే పునర్ముద్రణకు వచ్చేటంత ప్రచారం పొందిన రచయిత కొవ్వలి. కొద్ది నెలలలో వేల కాపీలు అమ్ముడయ్యేవి అక్షరాస్యత అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లోనే. ఇప్పటికీ కొవ్వలి నవలలకు ఆదరణ తగ్గలేదు.
తెలుగు వాళ్లు గర్వించదగిన నవలా రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారి శతజయంతి సందర్భంగా వారి నవలలన్నిటినీ క్రమంగా, సంపుటాలుగా తెలుగు పాఠకలోకానికి సమర్పించాలని తలపెట్టింది మీ ఎమెస్కో.
- Author: Kovvali Lakshmi Narasimharao
- Publisher: Emesco Books (Latest Edition: 2014)
- Paperback: 200 pages
- Language: Telugu