Madhupam (Telugu)
బాలుడు రాజిరెడ్డితో ముక్కలు ముక్కలుగా నాకు ఒకటిన్నరేళ్ల పరిచయం. ముక్కల్ని మాత్రమే కలిపిచూస్తే… కొన్ని పని గంటల పరిచయం. ఒక స్మాల్ పెగ్గు నిడివైనా లేని పరిచయం. ఈ నిడివిలోనే అనేకసార్లు అసందర్భంగా అతడితో కలిసి టీ తాగాను. నిరర్థకంగా కలిసి భోజనం చేశాను. నిస్సారంగా ఆఫీసు లిఫ్టులో కిందికీ, పైకీ కలిసి ప్రయాణించాను.
బాలుడు రాజిరెడ్డిలో నాకెలాంటి ఆసక్తీ లేదు. నిజం. స్త్రీని తట్టుకునే శక్తి రాజిరెడ్డికి లేదని నేను గ్రహించేవరకూ… అతడిలో నాకెలాంటి ఆసక్తీ కలగనేలేదు. స్త్రీ సౌందర్యం నిర్దాక్షిణ్యంగా, దౌర్జన్యంగా జరిపే అత్యాచారానికి చేతులు అడ్డుపెట్టుకోవడం ఇష్టంలేక దుఃఖితుడౌతున్నాడంటే… వాడిక బాలుడు కాడు. మనసును గట్టిగా కావలించుకుని వెళ్లిన ఆడమనిషి కోసం అన్నం నీళ్లు మాని, పులుపు తింటున్నాడంటే వాడు బాలుడు కాడు. రాజిరెడ్డి బాలుడు కాదని తెలిశాక, నేను స్త్రీగా పుట్టకపోవడంలోని సృష్టి అనౌచిత్యానికి అనేకసార్లు ఆకాశంలోకి చూశాను.
రాజిరెడ్డి “టచ్” బాగుంటుంది. స్త్రీని రఫ్ గా నిమురుతాడు. స్త్రీ కోరుకునే మొరటుతనం అది! బయట నిలబడి చూస్తే ఏమీ అర్థం కాదు.
-
Author: Pooduri Raji Reddy
- Publisher: Palapitta Book Publications (Latest Edition)
-
Paperback: 126 Pages
- Language: Telugu