Manovalmikam - A Novel Paperback – 13 October 2021
Manovalmikam - A Novel Paperback – 13 October 2021
ఈ నవలలోని పాత్రలు సృష్టింపబడ్డవి కాదు. మనం రోజూ చూసే జీవితంలో ఎదురయ్యే వ్యక్తులే ఈ కథలో పాత్రలుగా ఉంటారు. అందుకే ఈ కథ చదువుతున్నప్పుడు మన జీవితంలో జరిగిన చాలా విషయాల్లో మనల్ని మనం చూసుకుంటాం. ఈ కథలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరికీ ఒక కథ ఉంది. మనం చూడగలిగితే ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరిదీ ఒక ప్రత్యేకమైన కథ ఉంటుంది. ఆ కథలో ఎన్నో విషాదాలు, ఆనందాలు ఉంటాయి. ఎన్నో గెలుపులు, ఓటములు ఉంటాయి. వాటన్నింటినీ చెప్పగలిగే రీతిలో చెప్పగలిగితే, మనమనుకునే సామాన్య జీవితాలు కూడా అద్భుతమైన కథలుగా వెలిగిపోతాయి. కానీ అలా చేయడానికి రచయితకు అటువంటి చూపుండాలి. ముఖ్యంగా సాటి మనిషి పట్ల విపరీతమైన అక్కర ఉండాలి. వారి జీవితాన్ని మన జీవితంతో సమానంగా చూడగలగాలి. అలా చూడగలిగే మనసున్న రచయిత ఇందిర గారు. అందుకే ఇంత చిన్న నవలలో ఎన్నో జీవితాల సారాంశాన్ని మనసుకు హత్తుకునేలా రాయగలిగారు. ఇవన్నీ నిజజీవితంలో గమనించిన జీవితాల ఆధారంగా కొంత కల్పన జోడించి రచయిత నవలగా రాసుంటారని అనిపిస్తుంది. అందుకే ఈ కథ నాకు తెలిసిన వారి కథలా అనిపించడానికి ఒక కారణం అయ్యుండొచ్చు. - వెంకట్ శిద్దారెడ్డి
- Author: Dr.Peram Indira Devi
- Publisher: Anvikshiki Publishers Pvt Ltd (1 January 2021)
- Language: Telugu