Marste Key- Uthara Bharatana Nurella Dalitha Samajia Rajakiya Udyamalu (Telugu) - 2018
Sale price
₹ 139.00
Regular price
₹ 150.00
సాంబయ్య సాగించిన మేధో ప్రయాణంలో భాగస్వామిని కావటం నాకెంతో సంతోషంగా ఉంది. అందుకే ఈ తెలుగు
అనువాద ప్రయత్నంతో నేను మనస్ఫూర్తిగా మమేకమవుతున్నాను. ఉత్తర, దక్షిణ భారతాల్లో దళిత రాజకీయ
ప్రస్థానం కొంత భిన్నంగా ఉంది. వీటి మధ్యనున్న వ్యత్యాసాలపై ' నిజమైన' అవగాహనాపూరిత చర్చకు ఈ పుస్తకం బలమైన భూమికగా నిలుస్తుందని నమ్ముతున్నాను. భారతదేశంలో (ఆ మాటకొస్తే మరెక్కడైనాగానీ) సామాజిక రాజకీయ పరిణామ క్రమాలను లోతుగా విశ్లేషించి విమర్శించే పని అందులో అంతర్భాగంగా ఉన్నవారు చేస్తేనే విలువ ఉంటుంది. ఈ కోణం నుంచి చూసినప్పడు సాంబయ్య చేసిన కృషికి, పుస్తకానికి అదనపు విలువ, బలం చేకూరతాయి. వర్తమాన భారత సామాజిక, రాజకీయ పరిణామాలపై ఆసక్తి ఉన్న, పరిశోధిస్తున్న వారందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడే సమర్ధ రచన. అంతేకాదు, దళిత రాజకీయాల పట్ల ఏ ప్రాంతంలో, ఇక్కడ సానుకూలంగా,క్రియాశీలంగా ఉండే వారికైనా ఇది ఉపకరించే రచనే!
- Author: Gundimeda Sambaiah
- Publisher: Hyderabad Book Trust (Latest Edition)
- Paperback: 190 Pages
- Language: Telugu