Milinda Perfect Paperback – 1 January 2021
Milinda Perfect Paperback – 1 January 2021
మానస చేసిన ఈ ప్రయత్నం నిజంగా హర్షణీయం. LGBTQIH సముదాయాల గురించి తెలుగు సాహిత్యంలో చాలా తక్కువ రచనలు చదవటానికి అందుబాటులో ఉన్నాయి. అలా ఉన్నవన్నీ ఆయా సముదాయాల వారు వారికి జరిగిన అనుభవాలకు వ్రాత రూపంలో జీవం పోశారు. కానీ ఈమె మొదటిసారిగా మా సముదాయాల గురించి అందులో ఉన్న ప్రేమ, ఆకర్షణ, హింస, కేవలం ఆడ మగ అనే జెండర్లని మాత్రమే గుర్తించే సమాజంతో మా సముదాయాలు ఎలా తలపడతాయన్న సంఘర్షణలు అద్భుతంగా రాసి చూపించారు. - రచన ముద్రబోయిన, ట్రాన్స్ రైటర్ & ఆక్టివిస్ట్ కాలం ఒక్కో సమయానికి ఒక్కొక్కరిని ఎన్నుకుంటుంది. ఈ కాలపు కొన్ని కథలు చెప్పడానికి ఎన్నుకోబడిన రచయిత మానస. మనం మరిచిపోయిన, నిర్లక్ష్యం చేసిన ఎన్నో జీవితాలను తన కథల ద్వారా వెలుగు చూపింది మానస. కథలు ఇలాగే రాయాలి, ఇలానే ఉండాలి - అనే ఒక పాపులర్ నెరేటివ్‌ని ధ్వంసం చేస్తున్న ఇప్పటి యువతరం రచయితలలో మానస ముందు వరుసలో ఉంటుంది. - వెంకట్ శిద్దారెడ్డి, రచయిత, సినీ దర్శకులు
- Author: Manasa Yendluri
- Publisher: Anvikshiki Publishers Pvt Ltd (1 January 2021)
- Language: Telugu