Mr. Mohamatam Perfect Paperback – 1 January 2022
Mr. Mohamatam Perfect Paperback – 1 January 2022
తెలుగులో ఇంతవరకూ ఇంట్రావర్ట్స్ మీద పుస్తకం రాలేదు. ఇదొక మంచి ప్రయత్నం. చదివి మీలోని పాజిటివ్స్, నెగిటివ్స్ తెలుసుకుని ఈ...య్ అనిపించండి.. సగటు ఇంట్రావర్టులుగా మాకున్న పెద్ద ఆస్తి మొహమాటం. ఇలాంటి మాటలతో మా గురించి మేం చెప్పుకోడానికి కూడా మొహమాటమే. అందుకేనేమో.. ఇంతవరకూ మా ఇంట్రావర్టుల గురించి, మా కష్టాల గురించీ ఒక పుస్తకమంటూ రాలేదేమో అనిపించేది. మేమొక రకం మాదొక లోకం అనితర సాధ్యం మా వాలకం మాకున్న చిన్ని ప్రపంచంలో మేం బానే ఉంటున్నాం సరే. బైటి ప్రపంచానికి కూడా మా గురించి చెప్తే బావుంటుంది కదా అన్న ఆలోచనతో రాసిన పుస్తకమే ఈ మిస్టర్ మొహమాటం. చదవడానికి మీరు మొహమాటపడకండేం. అలా అని కేవలం ఇంట్రావర్ట్స్ మాత్రమే చదవాల్సిన పుస్తకమేమీ కాదిది. ఎవ్వరైనా హాయిగా చదివేయొచ్చు. నవ్వుకోవచ్చు. కొన్నిటి దగ్గర అయ్యో పాపం అనిపించొచ్చు. ఇంకొన్ని ఆలోచించేలా చేయొచ్చు. మొత్తంగా ఒక్కో ఛాప్టర్కి ఒక్కోలా ఫీలవ్వొచ్చు. సో.. జస్ట్ రీడ్ అండ్ ఎంజాయ్. కె.వి అనుదీప్, సినీదర్శకులు.
-
Author: Murali Sarkar
- Publisher: Anvikshiki Books (1 January 2022)
-
Paperback: 100 Pages
- Language: Telugu