Naa Pogaru Mimmalini Gayaparchinda? (Telugu) - Chirukaanuka

Naa Pogaru Mimmalini Gayaparchinda? (Telugu)

Regular price ₹ 100.00

ఈ పుస్తకం మర్యాదస్తుల పుస్తకం ఎంత మాత్రం కాదు. తనకు ఊహ తెలిసినప్పటి నుండి ` నిరంతరం అవమానపరిచే ` గాయపరిచే ` హత్య చేసే ప్రపంచంలో ఒక దళితుడి తీవ్రమైన తిరుగుబాటు గొంతు. ఇది కల్పిత సాహిత్యం కాదు. కటిక వాస్తవం. సాంప్రదాయిక పద్ధతికన్నా భిన్నంగా ` మన సాహిత్య వాతావరణానికి అలవాటు లేని పద్ధతిలో ` ఇలాంటి పుస్తకం రాయడం - ప్రచురించడం ఒక సాహసమే - ఆక్టోపస్‌లాగా, మృత్యువులా విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో - ప్రపంచ ప్రజలందరు తమ బలం, బలహీనతలను అంచనా వేసుకోవడానికి - ముఖ్యంగా ప్రజా ఉద్యమాలు ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలి. ప్రజా పోరాటాల్లో సమస్త కులాలు, సమస్త శక్తులు భుజం భుజం కలిపి పోరాడడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది......

ఈ పుస్తకం నా అంచనా ప్రకారంగా రెండు రకాలుగా ప్రతిస్పందనలు చెలరేగడానికి కారణం కాగలదనిపిస్తున్నది. దొంగకు తేలుకుట్టినట్లు ఈ పుస్తకాన్ని పట్టించుకోకపోడం. రెండోది వాయిలెంటు రియాక్షన్‌. ఇంతదూరం నడిచి కూడా - గోపి కత్తి అంచు మీదనే ఉన్నాడనిపిస్తుంది. ఇందులోని కొన్ని మాటలు మార్చవచ్చు. తొలగించవచ్చు- తద్వారా గోపికి మంచి పేరు రావచ్చు - మేధావిగా గుర్తింపు పొందవచ్చు - శత్రువులు తగ్గిపోవచ్చు... అయితే ఇది దృక్పథానికి సంబంధించిన సమస్య. ఇది లొంగిపోవడానికి, పోరాడటానికి సంబంధించిన సమస్య. లొంగిపోవడం ` పోరాడటం అనేవి మనిషి పుట్టుకతోనే దోపిడి సమాజాల్లో వెంటాడేవి. పోరాడటం గోపి నడక, ఆచరణ, నైజం....

- అల్లం రాజయ్య

  • Author: M.F. Gopi Nadh
  • Publisher: Hyderabad Book Trust (Latest Edition)
  • Paperback: 190 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out