Nadi Puttina Gonthuka (Telugu) - 2015
ఒకరోజు ఎందుకో హఠాత్తుగా 'నీతో చెప్పనే లేదు' అన్న వాక్యాలు వచ్చాయి...వ్రాశాను..ఆతర్వాత..ఏదో ఆలోచన ఉబికి వచ్చేది...వాక్యాలు తొణికి వచ్చేవి..వ్రాసుకుంటూ వెళ్ళిపోయాను. మిత్రులకు చదివి వినిపిస్తుండే వాడిని. మెచ్చుకునేవారు. శివుని త్రిశూలంలా ఉండేవి పువ్వులు ఒక చెట్టుకి...ఆ చెట్టు కింద కూర్చుని చదువుకునేవాణ్ణి. అక్కడే కూర్చుని వ్రాసుకుంటూ ఉండేవాడిని.
ఈ కవితలు ఒకసారి మిత్రుడు శ్రీ కె.శివారెడ్డికి వినిపిస్తున్నాను. 'నది పుట్టిన గొంతుక నదిమి పట్టారు' అన్న వాక్యాలు చదువుతుంటే పుస్తకానికి ఆ పేరు పెట్టండి అన్నారు. ఆయనకు ధన్యవాదాలు
జైలుకి వెళ్ళి భారతికి ఎంతో బాధ కలిగించాను. అందుకు గుర్తుగా ఈ కవిత ఆమెకు ఇస్తున్నాను.
గంగ హిమాలయాల్లో పుట్టింది
గోదావరి త్రైంబకంలో పుట్టింది
ఈ కవిత జైల్లో పుట్టింది
గంగ, గోదావరి ప్రవహించి, ప్రవహించి సముద్రంలో కలిశాయి.
గోదావరి సముద్రంలో కలిసిన చోట పుట్టాను నేను
ఈ కవిత జనసంద్రంలో కలుస్తుందని ఆశిస్తున్నాను...
- బొజ్జా తారకం
-
Author: Bojja Tarakam
- Publisher: Hyderabad Book Trust (Latest Edition)
-
Paperback: 94 Pages
- Language: Telugu