Needatho Yudham (Telugu)
నీడ తో యుద్ధం - [నాస్తిక, హేతు, నవ్య మానవ వాదాలపై, త్రీ పుస్తకాలు కలిపినా సంపుటం]
మాత మూఢత్వాల గురించి, బూర్జువా భౌతిక వాదనలను మర్క్స్, ఎంగల్స్, లెలిన్ ల ఆధారంగా చర్చించిన వ్యాసాలు!
'జ్ఞ్యానం' అన్నప్పుడు, అది రెండు రకాలు. ప్రకృతి గురించింది, సమాజం గురించింది. అవి రెండు కొన్ని సార్లు కలసి పోతాయి. రెండూ కలిసే సమస్యల్ని పరిష్కరిస్తాయి.
మనుషులు జ్ఞ్యానం నేర్చుకుంటున్న కొద్దీ జీవన పరిస్థితుల్ని మెరుగుపర్చుకోవాలి. సమాజంలో మొదటి నించీ అదే జరుగుతుంది. మంచి మార్పుని కలిగించలేని జ్ఞ్యానం, అసలు జ్ఞ్యానమే అవదు. జ్ఞ్యానానికి అదే గుర్తు. జీవిత పరి స్ధితుల్ని మెరుగుపరచ గలదా, లేదా? నాస్తికత్వం అభివృద్ధికరమైనది - అనడంలో సందేహం లేదు. అది, మూఢ నమ్మకాల్ని తీసివేయాలని ప్రయత్నిస్తుంది కాబట్టి. అయితే, దాని అభివృద్ధి పరిధి ఎంత? దేవుడు లేడనే జ్ఞ్యానం సమాజానికి ఏ రకంగా, ఎంత వరకు అభివృద్ధి? అసలు, ప్రజలు సమస్యలేమిటో నాస్తికత్వం గ్రహిస్తుందా? మనుషు లందరికి కష్ట సుఖాలు. అందరి ప్రయోజనాలూ, ఒకటే అయ్యే విధంగా అది చేయగలదా? అంత చేయకపోతే పోనీ ఎంత చేస్తుంది? దాని హద్దు లేమిటి ? దాని లక్ష్యా లేమిటి ? - ఇవన్నీ నాస్తికత్వం గురించి ప్రధానమైన ప్రశ్నలు.
నాస్తికత్వం గురించే కాదు: దాని లాగానే 'హేతువాదం', నవ్య మానవవాదం' అనే సిద్దాంతాలు కూడా వున్నాయి. నాస్తికత్వం మీద వచ్చే ప్రశ్నలు, ఆ ఇతర వాదాల మీద కూడా వస్తాయి. సిద్దాంతంగా వున్న దేని మీదైనా ఆ రకం ప్రశ్నలు తప్పవు.
-
Author: Ranganayakamma
- Publisher: Aruna Publications (Latest Edition)
- Language: Telugu