Oka Sexworker Aathmakatha (Telugu) - 2008
"మాకు కావాల్సింది మీ దయా, దాక్షిణ్యాలు కాదు - మా స్తిత్వానికి గుర్తింపు. అయితే, జయశ్రీ లాంటి కొద్ది మంది తప్ప సాధారణంగా ఫెమినిస్టులు కూడా సెక్స్ వర్కర్లకు గుర్తిమ్పునివ్వటానికి ఇష్టపడటం లేదు. సెక్స్ అనేది కేవలం మగవాళ్ళ అవసరం మాత్రమేననీ, స్త్రీలకు దాని అవసరం లేదనీ అందరూ భావిస్తూ వుంటారు. చాలా మంది ఫెమినిస్టుల ఆలోచన కూడా ఇందుకు భిన్నంగా లేదు.""సెక్స్ వర్క్ నా దినవారీ జీవితంలో మార్పులు తెచ్చింది. నా గత జీవితమంతా కష్టాలతో, వేదనతో గడచిపోయింది. కాస్త శుభ్రంగా తయారయ్యేందుకు కూడా సమయమ దొరికేది కాదు. సెక్స్ వర్కర్ గా జీవితం మొదలుపెట్టాక నా శరీరంపై శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరయింది. శుభ్రమైన, మంచి బట్టలు వేసుకోవరం నా మనసుకు ఆహ్లాదాన్నీ, ఆత్మస్తైర్యాన్నీ కలిగించింది. దీనివల్ల మగవాళ్ళు నన్ను చూసే దృష్టి లో మార్పు వచ్చింది. అంటే, వాళ్ళు నా క్లయింట్లుగా రావతమని కాదు నా వుద్దేశం - నా ఉనికిని గుర్తించి తీరాల్సిన అవసరం వాళ్లకు ఏర్పడుతోందని మాత్రమే."
- Author: Nalini Jameela
- Publisher: Hyderabad Book Trust (Latest Edition)
- Paperback: 121 Pages
- Language: Telugu