Pala Buggalu- Pasidi Moggalu (Telugu)
నేటి తల్లిదండ్రుల ఆలోచనలన్నీ 'కంప్యూటర్ పై వేళ్లు - అమెరికా వైపు కళ్లు' ధోరణితో డాలర్ల చేపల వేటలో జాలర్లవుతున్న మమ్మీ డాడీల వల్ల బుడిబుడి అడుగుల బాల్యానికి బడి బందిఖానాలో బేడీలు తప్పడం లేదు. పోటీతత్వం పేరుతో కార్పొ‘రేటు’ పాఠాలు చదువు‘కొనే’ పనితనం ఉగ్గుపాల దశలోనే బొగ్గు పులుసు వాయువుల్ని పీల్చుతూ వసివాడుతోంది. వెండి వెన్నెల వెలుగుల్లో గోరుముద్దలు తింటూ, కథలు విని కలల అలల్లో తేలియాడాల్సిన పాలచెక్కిళ్ళ పసిమితనం ఏపుగా పెరిగి కాపు కాయాల్సిన స్థానంలో ఫలాల ఫలితమివ్వక కుండీల్లో పెరిగే మరుగుజ్జు బోన్సాయ్ వృక్షమవుతోంది. కమ్మని కథలు చెప్పాల్సిన అమ్మమ్మలకు, బామ్మలకు, తాతయ్యలకు నేడు కరువొచ్చింది. ఆ కొరత ఈ పుస్తకం ద్వారా తీర్చాలన్నదే మా మరో ప్రయత్నం. గుడ్ పేరెంట్స్, గుడ్ టీచర్స్ కావాలనుకుంటున్న వాళ్ళంతా మా ‘పాలబుగ్గలు - పసిడిమొగ్గలు' సంపుటిని ఆదరిస్తారని ఆశిస్తూ...
- Author: Pulipati Yadagiri
- Publisher: Vishalandra Publishing House (Latest Edition)
- Paperback: 28 Pages
- Language: Telugu