Phala Deepika (Telugu)

Phala Deepika (Telugu)

Regular price ₹ 600.00

మన భారతావనిలో అనేకమంది మహా పురుషులు జన్మించి భావితరాల కోసం ఎంతో శ్రమించి వారు ఎన్నో గ్రంథాలు రచించి అపారజ్ఞానాన్ని మనకు స్థిరాస్తిగా ఇచ్చి వెళ్లారు. అలా వారు ఇచ్చినదానికి వెల లేక మూల్యము కాని నిర్ణయించలేని శాస్త్రజ్ఞాన సంపదను మనం ఈనాటికి కూడా పొందుతూనే ఉన్నాము. ఈ గ్రంథాలు మన జీవనసరళికి, మార్గదర్శిగా ఉండటమే కాక మనలోని అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి ఎంతో జ్ఞానకాంతులను మనకు ఇస్తూనే ఉన్నాయి. ఈ గ్రంథాలు హైందవ మత జీవనసరళికేకాక, విశ్వంలో అన్ని మతాలకు కూడా మార్గ దర్శకములుగా విరాజిల్లుతున్నదనడానికి ఏ మాత్రం సందేహం లేదు. పాశ్చాత్య దేశాలవారు కూడా మన మహాపురుషులు వ్రాసిన గ్రంథాలను తమ తమ భాషలలోకి అనువదించి, మన పూర్వుల మేధోసంపత్తును వారి శాస్త్ర పరిజ్ఞానానికి ఈనాటి అచ్చెరువొందటం అనే విషయం మనకు ఎంతో గర్వకారణం. ఉదాహరణకు వాల్మీకి వ్రాసిన రామాయణం, వ్యాసభగవానుడు రచించిన మహాభారతం ఈనాటికి కూడా అత్యంత విలువైన ధర్మాధర్మ విజ్ఞానాన్ని మనకు బోధిస్తూనే ఉన్నాయి. రామాయణాన్ని చదువనివాడిని రాక్షసప్రవృత్తిగల వాడని భారతం చదువనివాడిని బుద్ధిహీనతకలవడని ఒక నానుడి. ఇది నానుడే కాదు సత్యం కూడా. 

  • Author: Pandit Malladi Mani
  • Publisher: Victory Publications (Latest Edition)
  • Paperback: 630 Pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out