Pillala Bommala Paramanandaiah Sishyula Kathalu (Telugu)
శిష్యులందరూ చుట్టూ చేరి సపర్యలు చేస్తూ వుండటం వల్ల కొద్ది సేపట్లోనే పరమానందయ్యగారు నిద్రలోకి జారుకున్నారు. అయితే శిష్యుల మధ్య గొడవ మొదలయింది. గురువుగారి కాళ్ళు ఎవరు వత్తాలి అనే అంశం దగ్గర శిష్యులు వాళ్ళలో వాళ్ళు కలహించుకోవటం ప్రారంభించారు. గురువుగారి రెండు కాళ్ళలో ఏ కాలు గొప్పదనే విషయంలో తీవ్ర అభిప్రాయ భేదాలు వచ్చాయి. ''నేను వత్తుతూ వున్న కాలు గొప్పది, '' అని ఒక శిష్యుడు ప్రకటించాడు. రెండవ వాడు ''కాదు, నేను వత్తుతూవున్న కాలే నిజంగా గొప్పది'' అని గొడవ మొదలుపెట్టాడు. గొడవ తీవ్ర స్థాయికి చేరింది. ఆ సందర్భంలో ఒకడు లేచి, ''నీవు వత్తుతూ వున్న కాలిని నరికేస్తానని'' అరిచాడు. రెండవవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కత్తి తీసుకువచ్చి కాలు నరకానికి సిద్ధమయ్యాడు. అందరూ కేకలు, పెడబొబ్బలు పెడుతూ వున్నారు. ఆ గొడవకు గురువుగారు నిద్రనుంచి మేల్కొన్నారు. ''ఎందుకు అందరూ గొడవ పడుతున్నారు? ఏం జరిగింది'' అని శిష్యుల్ని అడిగాడు గురువుగారు. శిష్యులు అందరూ ఏక కంఠంతో ఏం జరిగిందో వివరించారు. మళ్ళీ గొడవ మొదలయింది. శిష్యుల్ని నెమ్మదించమని అడిగాడు గురువుగారు. ఆ ప్రయత్నంలో పైకి లేవబోయారు.
గురువుగారికి ఆ అవకాశం శిష్యులు ఇవ్వలేదు. గురువుగార్ని గట్టిగా పట్టుకుని, ''గురువుగారూ! వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఇంతే. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. పోట్లాడుకోనివ్వండి, అలాగే కాళ్ళు కూడా నరుక్కోనివ్వండి. ఏం జరుగుతుందో చూస్తూ వుండండి'', అని చెప్పి ఆయన్ను అలాగే పట్టుకుని కదలకుండ చేశారు.
- Author: Reddy Raghavaiah
- Publisher: Swathi Book House
- Paperback: 32 pages
- Pictures Colour: Colour Pictures
- Languages: Telugu
- Ages: 0-10