Puranala Kula Vyavasta- 5 (Telugu) - 2013
రామాయణాన్ని ఒక కావ్యంగానూ మత గ్రంథంగానూ కాకుండా సామాజిక దృష్టితో పరిశీలిస్తే ఎన్నెన్నో కొత్త అంశాలు ప్రకటితమవుతూ ఉంటాయి. రాముని కథలో అనేక కథలున్నాయి. మునుల కథలు, అసురుల కథలు - శాపాల కథలు - వీటితోబాటు శాస్త్ర చర్చలు - ధర్మాధర్మ నిరూపణ యత్నాలు చాలా కనిపిస్తాయి. మునుల కథల ఆధారంగా అప్పటి వర్ణధర్మాన్ని విద్యా వ్యవస్థను పరిశీలించటం ఈ గ్రంథం లక్ష్యం. ఈ కోణంలో పరిశీలనకు మతంగ, విశ్వామిత్ర, శంబూకుల కథలు ప్రధానంగా గ్రహించటం జరిగింది. ..ఈ కథలలో ఒక సామాజిక క్రమం ఉన్నది. మతంగుని కాలం నాటికి విద్యలపైనా తపస్సులపైనా ఆంక్షలు లేవు. విశ్వామిత్రుని కాలం నాటికి కొన్ని వ్యవస్థలు బ్రాహ్మణ, వైశ్య వర్గాలకే ప్రత్యేకించారు. క్షత్రియులకు కొన్ని వ్యవస్థలు నిరాకరించారు. అప్పటికి క్షత్రియులు అద్విజులు. శంబూకుని కాలం నాటికి క్షత్రియుల నుండి శూద్రులను - అతి శూద్రులను వేరుచేసి వారికి అన్ని విద్యలు నిషేధించారు. రామరాజ్య వ్యవస్థలోని పరిణామ క్రమం ఇది. శూద్రుల సామాజిక స్థాయిలో అమానవీయత ఎందువల్ల ఎప్పుడు ప్రవేశించింది అనేది ఆలోచించాలి.
- Author: B. Vijayabharathi
- Publisher: Hyderabad Book Trust (Latest Edition)
- Paperback: 100 Pages
- Language: Telugu