
Rallapalli SAahitya, Sangiita Vyaasaalu (Telugu) - 2017
మన విద్యావిధానంలో ప్రాచీన తెలుగు కావ్యనాటకాలకే కాదు, ఆధునిక తెలుగుకావ్య నాటకాలకు కూడ ప్రాధాన్యం తగ్గిపోయిన, శరవేగంగా తగ్గుతున్న చెడ్డరోజులివి. దినదినానికీ డిగ్రీల, పిహెచ్.డి. పట్టాల ప్రతాపం విజృంభిస్తున్న కాలమిది. ఎన్ని డిగ్రీల వరుసలు పేర్చుకున్నా, కడుపు నింపుకొనడానికి కొరగాని దుర్దినాలివి. అలాంటప్పుడు తాతతాతల నాటి వ్యాసాల్ని తవ్వితీయడమెందుకని కొందరు అడగొచ్చు, నిజమే. గీతవృత్తపద్యాల్ని చదవడానికే తనుకులాడే రోజులివి. ఇకపోతే వాటి భావార్థం కూడా యమ్.ఏ. పిహెచ్.డి. పట్టాదార్లు తెలుసుకోలేని, డిగ్రీల బరువు కింద నలిగిపోతున్న పాడు కాలమిది. వ్యాసం ఎలా రాయాలో, దాని ఆది, మధ్య, అంతాలు ఏవిధంగా వుండాలో, అసలు ఆశయమేమిటో, స్పష్టంగా, సులభంగా అభిప్రాయాలు వెల్లడించాలంటే ఏం చేయాలో, తెలుగు నుడికారం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే, దారి చూపేందుకే ఈ ‘రాళ్ళపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు’ మీ ముందుకు రావడం. రాళ్ళపల్లివారి ఈ రమణీయ రచనలు నేటి యువతరానికీ, గురుతరానికీ దారిదీపాలు కాగలవని ఆశిస్తూ...
- Author: Rallapalli Anamkrishna Sharma
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 368 pages
- Language: Telugu