Smashanam Dunneru (Telugu) - 2011
Regular price
₹ 80.00
హరిజనుల మీద పెత్తనం చెలాయించినంత మాత్రాన, వారి మీద చీటికిమాటికి నోరు పారేసుకున్నంత మాత్రాన తాము పెత్తందార్లయిపోరు. పెత్తందార్ల తొత్తులుగానే మిగిలిపోతారు. తమ ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి వస్తే తొత్తుల్ని కూడా వెంటాడి వేధిస్తారు అదే పెత్తందార్లు.
బి.సి. కులాల సహాకారం తీసుకుంటునే హరిజనుల్ని అణచివేసే భూస్వామ్యపు అహంకారం, స్వార్థం, కుటిల వ్యూహంలోని ఎత్తుగడలు అర్థమవుతాయి ఈ నవల చదివితే.
ముఖ్యంగా పీడిత కులాల్లోని అంతర్గత వైరుధ్యాల్ని తమ స్వప్రయోజనాలకు అణుగుణంగా రెచ్చగొట్టడమనే పద్ధతి ఈ నాటికీ కొనసాగడం వర్తమాన, సామాజిక, రాజకీయ పరిస్థితుల్ని గమనించిన వారికి తేటతెల్లంగా కనిపిస్తోంది. అందుకే 'స్మశానం దున్నేరు' నవల కేవలం ఒక కథ మాత్రమే కాదు. ఒకనాటి జీవితాన్ని రికార్డు చేసిన నవల మాత్రమే కాదు, దానికి సామాజికపరమైన ప్రాసంగికత వుంది.
- గుడిపాటి
-
Author: Keshava Reddy
- Publisher: Hyderabad Book Trust (Latest Edition)
-
Paperback: 160 Pages
- Language: Telugu