
The Girl in Room 105 (Telugu) Paperback - 2019
హాయ్, నేను కేశవ్ ని. నా జీవితం అస్తవ్యస్తంగా ఉంది. చేసే ఉద్యోగమంటే నాకిష్టం లేదు. నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసింది. అందమైన జారా. కశ్మీరీ ముస్లిం. అన్నట్లు నేను మా కుటుంబం కొంచెం సాంప్రదాయికమైందని చెప్పానా మీకు? సరే, దాన్నలా పక్కన పెడదాం.
నేను, జారా నాలుగేళ్ళ క్రితం విడిపోయాం. తను నన్ను మర్చిపోయింది. నేను తనని మర్చిపోలేదు. తనని మర్చిపోవడానికి ప్రతిరాత్రీ తాగేవాణ్ణి. తనకి ఫోన్లు చేసి, మెసేజ్లు పెట్టి సోషల్ మీడియాలో వెంటపడుతుండేవాడిని. తను నన్ను పట్టించుకోలేదు.
అయితే, ఆ రాత్రి, తన పుట్టినరోజు ముందు రాత్రి, జారా నాకు మెసేజ్ పెట్టింది. పాతరోజుల్లోలానే, తన హాస్టలు గది 105కు రమ్మని పిలిచింది. నేను వెళ్ళి ఉండకూడదు, కాని వెళ్ళాను... నా జీవితం శాశ్వతంగా మారిపోయింది.
ఇది ప్రేమ కథ కాదు. ప్రేమించని ప్రేమకథ.
ఫైవ్ పాయింట్ సమ్ వన్, 2 స్టేట్స్రచయిత కలం నుంచి జాలువారిన సరదాగా, ఉత్కంఠభరితంగా సాగే థ్రిల్లర్. సమకాలీన భారతదేశ పరిస్థితుల నేపథ్యంలో మర్చిపోలేని ప్రేమ గురించి, జీవితానికి ఓ లక్ష్యాన్ని కనుగొనడం గురించి ఆపకుండా చదివించే నవల. చేతన్ భగత్ గురించి ఇంకా తెలుసుకోండి.
- Author: Chetan Bhagat
- Paperback: 296 pages
- Publisher: Westland (31 March 2019)
- Language: Telugu