Vaidyaniki Susthi (Telugu)
ఆరోగ్య రక్షణ వ్యవస్థకే అనారోగ్యం
అవసరం లేకపోయినా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, ఖరీదైన మందులు రాస్తున్నారని, ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని అందరూ పిర్యాదు చేస్తూ ఉంటారు. కానీ, ఇది నిజంగా ఏ స్థాయికి దిగజారిందో వైద్య వ్యవస్థ వెలుపల ఉన్నవారికి తెలియదు. డెబ్బై ఎనిమిది మంది వైద్యుల నుంచి సేకరించిన సమాచారంతో డా. అరుణ్ గాద్రే, డా అభయ్ శుక్లా ఈ పుస్తకం వ్రాశారు. అమాయక రోగులను ఆసుపత్రులు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఎలా దోపిడీ చేస్తున్నాయో ఈ వైద్యులు ధైర్యంగా వెల్లడించారు. ఒక వైపు ఫార్మా కంపెనీలు కోట్లకు పడగలెత్తుతుంటే మరో వైపు రోగాల బారిన పడిన ప్రజలు దివాళా తీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్రమాలను నియంత్రించడంలో వైద్య సంఘాల వైఫల్యం, నిజాయితీ పరులైన వైద్యుల నిస్సహాయత, ప్రజల నుంచి పెరుగుతున్న నిరసనల నేపధ్యంలో వెలువడిన ఈ పుస్తకం, వైద్య వృత్తిని కబళిస్తున్న అక్రమాలను సాధికారికంగా వెల్లడించడమే కాక, వాటి పరిష్కారానికి వివిధ స్థాయిలలో జరగవలసిన కృషిని ఆచరణాత్మకంగా చర్చించింది. వైద్యానికి పట్టిన జబ్బును నయం చేసి ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోగలమనే భరోసా ఇచ్చింది.
''వైద్య రంగంలోని సమస్యలను తెలియజేయడానికి ఇంతకంటే మెరుగైన మార్గమేదీ నాకు కనిపించడం లేదు''.
- డా. సమీరన్ నంది, డీన్, గంగారామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ & ఛైర్మన్, కమిటీ ఫర్ ఎథికల్ ప్రాక్టీస్
-
Author: Dr. Arun Gadre
- Publisher: Prajashakthi Book House (Latest Edition)
-
Paperback: 184 Pages
- Language: Telugu