Vallu Padina Bhupala Ragam Perfect Paperback – 1 January 2022
Vallu Padina Bhupala Ragam Perfect Paperback – 1 January 2022
"డా. పి. శ్రీదేవి 'కాలాతీత వ్యక్తులు' నవలలో పాత్రల్లాగే మరుపురాని పాత్రలతో ఉన్న కథగా చటుక్కున చెప్పదగినది - 'వాళ్ళు పాడిన భూపాలరాగం.' భారత స్వాతంత్య్రానంతరం తొలి పదేళ్ళలో సమాజంలోని ఆర్థిక సంక్షోభం, మధ్యతరగతి కుటుంబాలలో మానవ సంబంధాలపై ప్రభావం చూపించి ఆర్థిక సంబంధాలుగా మాత్రమే మార్చేసిన సామాజిక పరిస్థితులు కథలో ప్రతీదృశ్యంలోనూ ప్రతిబింబిస్తుంటాయి. ఈ కథలో పట్టణ జీవితానికీ, నగర జీవితానికి గల వ్యత్యాసం కనిపిస్తుంది. సమాజంలోని సాధారణ మధ్యతరగతి జీవులు నగర జీవితాలలో ప్రలోభపెట్టే అలవాట్లకి ఆకర్షితులు కావటం తమ తాహతును గుర్తించకుండా అనేకానేక ప్రలోభాలకు బలై అప్పులపాలై జీవితాలను అస్తవ్యస్తం చేసుకోవటం వలన అంతకంతకూ లేమిలో కూరుకుపోయి చస్తూ బతికే బతుకులను అద్దంలా ప్రస్ఫుటంగా చూపిస్తుంది. ఆ ప్రలోభాలకు చిక్కకుండా ఉండటానికి కావలసిన తెలివి తేటలు లేకపోతే శ్లేష్మంలో ఈగల్లా, బురద గుంటలో పందుల్లాగా బతకాల్సిందే. ఈ నిజాల్ని తెలియపరచటానికి ఒక్కొక్క కుటుంబాన్ని పరిచయం చేస్తుంది రచయిత్రి.
- Author: P. Sridevi
- Publisher: Anvikshiki Publishers (1 January 2022)
- Language: Telugu
- Paperback: 228 pages