Vichitra Rakumari (Telugu)
ఈ పుస్తకంలో రెండు కథలు ఉన్నాయి. ఇవి ఉక్రేనియన్ జానపద కథలు. మొదటి కథ “దయ్యం పూనిన రాకుమారి”; రెండవ కథ “ఏడుగురు అన్నలు – చిట్టి చెల్లి”.
మొదటి కథ పెళ్ళీడు కొచ్చిన ఓ రాకుమారి కథ. ఆమెకి ఓ పట్టాన ఎవరూ నచ్చరు. ఆమె వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఆమె ఎందుకలా ప్రవర్తిస్తోందో తెలుసుకోడానికి రాజు కొంతమందిని నియమిస్తాడు. కానీ వారంతా చనిపోతుంటారు. ఎందుకిలా జరుగుతోందో గ్రహించాలనుకున్న ఓ జిప్సీ యువకుడు సాహసం చేస్తాడు. చివరికి ఏమైందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే. ఈ కథలకు ఫ్లోరియన్ యుర్యేవ్ గీసిన బొమ్మలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. వర్ణ మిశ్రమం ఎంతో ఆకట్టుకుంటుంది.
రెండవ కథ ఏడుగురు అన్నలున్న ఓ చిట్టి చెల్లి కథ. అల్లరి చేస్తున కొడుకులని కాకులుగా మారిపొమ్మని తల్లి అంటే వాళ్లు నిజంగానే కాకులై ఎగిరిపోతారు. పిల్లల కోసం వగచిన ఆ తల్లికి చాలా కాలానికి ఓ కూతురు పుడుతుంది. తన అన్నల సంగతి తెలుసుకుని వాళ్ళని వెదుక్కుంటూ వెడుతుంది. అన్నలను కలుసుకుంటుంది, కానీ వారి మాట వినకుండా ప్రమాదంలో పడుతుంది. చివరకు ఏమైందనేది ఆసక్తిదాయకం. ఈ కథకు ఇవాన్ ఓస్టాఫెచుక్ గీసిన బొమ్మలు పిల్లలనే కాకుండా పెద్దలను సైతం ఆకట్టుకుంటాయి.
-
Author: Prashanth Pinge
- Publisher: Manchi Pustakam Publications (Latest Edition)
-
Paperback:
- Language: Telugu